తెలంగాణలో లాక్ డౌన్ పై మంత్రి ఈటల క్లారిటీ

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం విధించిన నైట్ కర్ఫ్యూ ఈ నెల 30వ తేదీతో ముగియనుంది. లాక్‍డౌన్‍పై సీఎం కేసీఆర్‍దే తుది నిర్ణయమంటూ ప్రకటించడంతో ఈ నెల 30 తర్వాత తెలంగాణలో లాక్‍డౌన్ తప్పదా? అనే చర్చ మొదలైంది. అయితే దీనిపై మంత్రి క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో లాక్‍డౌన్ పెట్టే ఆలోచన లేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. రేపట్నుంచి 19 జిల్లా డయాగ్నొస్టిక్ హబ్‍లు ప్రారంభిస్తామన్నారు. హోం ఐసోలేషన్‍లో ఉన్న వారికి జిల్లా డయాగ్నొస్టిక్ కేంద్రాల్లో రక్త పరీక్షలు నిర్వహిస్తామన్నారు. హోం ఐసోలేషన్‍లో ఉన్న వారు 3, 4 రోజులకు ఒకసారి రక్త పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఔషధాలు, ఆక్సిజన్ ఎక్కువ ధరకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో ఆంధప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‍గఢ్ రాష్ట్రాలకు చెందిన రోగులకు చికిత్స అందిస్తున్నామని తెలిపారు.
కేంద్రం చేయాల్సిన తప్పులన్నీ చేసి రాష్ట్రాలను నిందించడం సరికాదని అగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ సాధ్యం కాదని స్పష్టం చేశారు. వ్యాక్సిన్లు వస్తే వేస్తాం కానీ, ప్రస్తుతం వ్యాక్సినేషన్ సాధ్యం కాదని పేర్కొన్నారు. బీజేపీ పాలి రాష్ట్రాల్లో కరోనా కేసులు, మరణాలపై తప్పుడు వార్తలు ఇస్తున్నారని మండిపడ్డారు.