రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద జాతీయ జెండా.. ఆవిష్కరణ
తెలంగాణ రాష్ట్రంలో రెండో అతిపెద్ద (100 అడుగుల) జాతీయ జెండాను మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ జిల్లా పరిషత్ స్కూల్ ఆవరణలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ జాతీయ జెండా 20 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పుతో దేశభక్తిని చాటేలా రెప రెపలాడుతుందన్నారు. ఈ జాతీయ జెండా కోసం 20 లక్షల రూపాయలు ఖర్చు చేశామన్నారు. భారీ జాతీయ జెండాను ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. డాక్టర్ సోమేశ్వర్ రావు, ఇతర దాతలు కలిసి కమిటీగా ఏర్పడి జాతీయ సమైక్యత కోసం ఈ బృహత్ కార్యాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి ఇప్పటికే మన ఐక్యమత్వాన్ని చాటాం. మనమంతా ఐక్యతను చాటి మన రాష్ట్ర, దేశ అభివృద్ధిలో పాలుపంచుకుందాం. మన మధ్య విద్వేషాలు పెంచుతున్న అరాచక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు.













