అమెరికాలో మంత్రి ఎర్రబెల్లి జన్మదిన వేడుకలు
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జన్మదిన వేడుకలు అమెరికాలో ఘనంగా జరిగాయి. అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహాసభలలో ముఖ్య అతిథిగా పాల్గొనడానికి మంత్రి ఎర్రబెల్లి అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్ ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అమెరికాలోనే ఉన్న మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, చాకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, గాదరి కిశోర్, ఎన్నారైలు ఆటా ప్రతినిధుల సమక్షంలో ఆయన కేక్ కట్ చేశారు. ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని వారంతా ఆకాంక్షించారు. తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ మంత్రి ధన్యవాదాలు తెలిపారు.













