ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి చందులాల్ వెల్లడించారు. సచివాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్సవాల సందర్భంగా దేశంలో మొదటిసారిగా హైదరాబాద్‌లోని బైసన్ పోలో మైదానంలో పారా మోటరింగ్ రైడ్‌ను నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జూన్ 3 నుంచి 5 వరకు జాయ్ రైడ్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ఎంపికైన అవార్డు గ్రహితలకు రవీంద్ర భారతిలో జూన్ 2న సాయంత్రం 6 గంటలకు పురస్కారాలను అందజేస్తామని పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు.













