ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాలములో తెరాస ఎన్నారై ప్లినరీ పాల్గొననున్న మంత్రి మరియు ఎమ్మెల్లేలు : మహేష్ బిగాల

ప్రపంచ వ్యాప్తంగా టీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు జూమ్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 50 టీఆర్‌ఎస్ ఎన్నారై శాఖలతో భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటలకు జూమ్ ద్వారా టీఆర్‌ఎస్ ఎన్నారైల ప్లీనరీని నిర్వహిస్తున్నారని మహేష్ బిగాల తెలిపారు. 2001లో ఏప్రిల్ 27న ఆవిర్భవించిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి (TRS). అప్పట్లో ఉద్యమ ఊపిరిగా మారిన కేసీఆర్.. రాష్ట్రంలో యువతను పెద్దవారిని అందర్నీ ఏక తాటిపై నడిపించారని మహేష్ పేర్కొన్నారు. ఈ అంతర్జాల కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, ఎమ్మెల్లేలు చెన్నమనేని రమేష్, గణేష్ బిగాల గారు పాల్గొననున్నారు.