టీఆర్ఎస్ కు ఎంఐఎం మద్దతు
రాజ్యసభ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఎంఐఎం తన సంపూర్ణ మద్దతును ప్రకటించింది. తెలంగాణలో ఖాళీయైన 3 రాజ్యసభ స్థానాల్లో టీఆర్ఎస్ నిలిపే అభ్యర్థులకు తన సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఏఐఎంఐఎం అధినేత అసదుద్ధీన్ ఓవైసీ తెలిపారు. ఈ నెల 23వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 12 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. అదేరోజు ఫలితాలు విడుదల చేస్తారు. రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలం 90 కాగా, ఎంఐఎం మద్దతుతో 97కు పెరిగింది. మరోవైపు రాజ్యసభ ఎన్నికల్లో బరిలో ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ క్రమంలో ఓవైసీ టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించినట్లు తెలుస్తోంది.













