ఈనెల 9న మిలియన్ మార్చ్
ఈనెల 9న మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ మిలియన్ మార్చ్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సంపూర్ణ మద్దతిచ్చారని అన్నారు. అలాగే మిలియన్ మార్చ్‌కు ఉద్యోగ సంఘాల మద్దతు కోరతామని అన్నారు. సీఎం కేసీఆర్ డెడ్‌లైన్‌కు ఒక్క కార్మికుడూ స్పందించలేదన్నారు. మంత్రుల వాహనాల్లో తీసుకెళ్లి విధుల్లో చేర్పించినా కార్మికులు మళ్లీ వెనక్కి వస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వానికి కార్మికులు భయపడాల్సిన అవసరంలేదని అన్నారు. బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసేంందుకు తమ ప్రతినిధులు ఢిల్లీ వెళ్లారని ఆయన తెలిపారు. కేంద్రం ఆమోదం లేకుండా ఆర్టీసీపై ప్రభుత్వం విధాన నిర్ణయాలు తీసుకోలేదని అన్నారు. ప్రభుత్వంలో చర్చలకు ఆర్టీసీ జేఏసీ సిద్ధంగా ఉందన్నారు. చట్టబద్ధత ఉంటే అటెండర్ కమిటీతోనైనా చర్చిస్తామన్నారు. సమ్మెను జఠిలం చేయొద్దని ముఖ్యమంత్రిని కోరుతున్నామని పేర్కొన్నారు.













