హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్
తెలంగాణ రాష్ట్రంలో దిగ్గజ సాఫ్ట్వేర్ సంస్థ మైక్రో సాప్ట్ హైదరాబాద్‌లో రూ.15 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నది. రాబోయే 15 సంవత్సరాల్లో దశల వారిగా పెట్టనున్న ఈ పెట్టుబడితో రాజధాని నగరం అతి పెద్ద డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో జరిగిన ఓ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో పుణె, ముంబై, చెన్నై నగరాల్లో ఉన్న డేటా సెంటర్లకు అదనంగా ఈ కొత్త కేంద్రం సేవలు అందించనున్నది. క్లౌడ్, ఏఐ ఆధారిత డిజిటల్ ఎకానమీ కస్టమర్లకు సాయం చేసేందుకు మైక్రోసాఫ్ట్ సంస్థ వ్యూహాత్మకంగా ఈ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది.
మైక్రోసాఫ్ట్ ఫోర్ట ఫోలియోలో ఉన్న క్లౌడ్ డేటా సొల్యూషన్స్, ఆర్టిపిషియల్ ఇంటెలిజిన్స్, ప్రొడక్టివిటీ టూల్స్, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ సర్వీసులు ఇవ్వనున్నది. వ్యాపార సంస్థలకు స్టార్టప్‌లు డెవలపర్స్, ఎడ్యుకేషన్ ప్రభుత్వ సంస్థలకు ఈ సేవలు అందనున్నాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర ఐటీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, రాష్ట్ర,ఐటీ, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రతినిధులు పలువురు పాల్గొన్నారు.













