తొలిరోజు రికార్డులన్నీ బ్రేక్
ప్రతిపాదన నుంచి ప్రారంభం వరకు అనేక అంశాల్లో చరిత్ర సృష్టిస్తున్న హైదరాబాద్ మెట్రోరైలు తొలిరోజే మరో రికార్డు సృష్టించింది. దేశంలోని మిగతా మెట్రోలతో పోల్చితే మొదటి రోజు దాదాపు లక్ష మంది ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చి ఆల్ టైం రికార్డు నెలకొల్పింది. మొదట ప్రారంభమైన కోల్కతా మెట్రో మొదలుకొని, ఈ ఏడాది ప్రారంభమైన కొచ్చి, లక్నో మెట్రోల వరకు ఏవీ మన రికార్డుకు చేరువలో కూడా లేవు. ఇప్పటివరకు తొమ్మిది మెట్రోలు ప్రారంభం కాగా, ఎక్కడా తొలి రోజు ప్రయాణికుల సంఖ్య 50 వేలు కూడా దాటలేదు. మన మెట్రో లో మాత్రం లక్ష మంది ప్రయాణించారు. తొలిరోజు వసూళ్లలోనూ మన మెట్రో రికార్డు బ్రేక్ చేస్తుందని అధికారుల చెప్తున్నారు. పని దినాల్లోనే ఇంత భారీ స్పందన ఉంటే శని, ఆదివారల్లో మెట్రో జాతర జరుగుతుందంటున్నారు.













