సీఎం సహాయ నిధికి మేఘా రూ.5 కోట్ల విరాళం

తెలంగాణ రాష్ట్రంలో వరద బాధితుల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాల వెల్లువ కొనసాగుతోంది. పలువురు వ్యాపార, సినీ రంగ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలసి విరాళాలు అందజేశారు. మేఘా సంస్థ (ఎంఈఐఎల్) ఎఎండీ కృష్ణారెడ్డి రూ.5 కోట్లు, లలితా జ్యువెలర్స్ అధినేత కిరణ్ రూ.కోటి విరాళం ఇచ్చారు. సైయంట్ సంస్థ రూ.కోటి, మైత్రా ఎనర్జీ గ్రూప్ అక్షత్ గ్రీన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.కోటి అందజేయశాయి.