సీఎం రేవంత్ తో మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి భేటీ

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌గా నియమితులైన కె.శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. సచివాలయంలో ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిసి తనను రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్‌గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డిని శాలువాతో సన్మానించి, అభినందించారు.