మేడారంలో దర్శనాలు ప్రారంభం..

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం లోని సమ్మక్క-సారలమ్మల దర్శనాలు ప్రారంభమయ్యాయి. లాక్‍డౌన్ ఎత్తేయడంతో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో పూజారులు సమావేశం నిర్వహించి వనదేవతల దర్శనానికి భక్తులను అనుమతించేందుకు నిర్ణయించారు. సమ్మక్క-సారలమ్మలకు మొదటగా పూజారులతో పాటు వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు న్విహించారు. అనంతరం భక్తులు అమ్మవార్లను దర్శించుకునేందకు అనుమతిస్తున్నట్టు ప్రకటించారు.