కరోనాతో మేడారం పూజారి భార్య మృతి

ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారంలో గల సమ్మక్క దేవత ప్రధాన పూజారి సిద్దబోయిన రామారావు భార్య సృజన (25)కరోనాతో మృతి చెందింది. సృజన పది రోజుల క్రితం కరోనా బారిన పడింది. ఇంటి వద్దనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నది. కాగా మంగళవారం పరిస్థితి విషమంగా మారడంతో ములుగులోని ఓ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.