సమ్మక్క, సారలమ్మ భక్తులకు ఇంటివద్దకే ప్రసాదం
మేడారం సమ్మక్క సారలమ్మ భక్తులకు శుభవార్త. ప్రసాదాన్ని ఆర్టీసి, తపాల శాఖల ద్వారా భక్తుల ఇళ్ల వద్దకు చేర్చనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ, తపాలా, ఐటీ శాఖల సహకారంతో డోర్ డేలివరీ చేసేలా దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేస్తుందన్నారు. అమ్మవారి ప్రసాదంను డోర్ డేలివరీ చేసేందుకు ఇండియన్ పోస్టల్, ఆర్టీసీ, ఐటీ శాఖల సేవలను వినియోగించుకోనున్నట్లు తెలిపారు. అమ్మవారి ప్రసాదం నేరుగా పొందలేని వారికి భారత పోస్టల్ సర్వీసు, ఆర్టీసీ కొరియర్ సర్వీసు ద్వారా ఇంటికి చేరవేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. ఆన్లైన్లో గానీ, మీ సేవా గానీ, ఇంటి పోలియో ద్వారా యాప్‌లో గానీ బుక్ చేసుకోవాలన్నారు. అనంతరం వారికి పోస్టల్ సేవల ద్వారా ప్రసాదాన్ని డోర్ డెలివరీ చేస్తామన్నారు. ఈ సేవలకు ఒక ప్రసాదం ప్యాకెట్‌కు భక్తులు రూ.225 లు చెల్లించాల్సి ఉంటుంది. 200 గ్రామూల బెల్లం ప్రసాదం, పసుపు, కుంకుమ, అమ్మవారి ఫోటోను భక్తులకు ఇంటి వద్దకు అందిస్తామన్నారు. ఫిబ్రవరి 12-22 వరకు ఆన్లైన్లో ఇంటికే ప్రసాదం సేవలను వినియోగించుకోవాలని మంత్రి కోరారు.













