మేడారం జాతర విజయవంతం
తెంగాణ ప్రభుత్వం ఎలాంటి ఇబ్బంది లేకుండా సమ్మక్క-సారక్క జాతరను ఘనంగా నిర్వహించిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. మేడారం జాతరపై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్, సత్యవతి రాథోడ్ మీడియాతో మాట్లాడారు. జాతరను విజయవంతంగా నిర్వహించడంలో మీడియా కీకంగా వ్యవహరించిందని తెలిపారు. మేడారం జాతర నిర్వహణపై సీఎం కేసీఆర్ నిరంతరం సమీక్షు జరిపారని తెలిపారు. జాతర నిర్వహణ చూసి బీజేపీ నేతలు సైతం మెచ్చుకున్నారని పేర్కొన్నారు. మేడారం సమ్మక్క-సారమ్మ జాతరను జాతీయ ఉత్సవంగా కేంద్రం గుర్తించాలని ఎర్రబెల్లి కోరారు. జాతరకు జాతీయ పండగ గుర్తింపు సాధించేందుకు ప్రజలందరి సహకారం కావాన్నారు.
సమ్మక్క-సారమ్మ దీవెనలే ప్రభుత్వాన్ని ముందుకు నడిపించాయని అన్నారు. మేడారం జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతులు తెలియజేస్తున్నట్లు మంత్రి వివరించారు. త్వరలోనే శాశ్వత ప్రాతిపదికన వసతు ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం 100 ఎకరాలు సేకరిస్తామని చెప్పారు. పర్యాటక ప్రాంతంగా మేడారాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచిస్తున్నారని అన్నారు.













