మేడారంలో జన జాతర మొదలైంది
ములుగు జిల్లా మేడారంలో జన జాతర మొదలైంది. లక్షలాదిగా తరలివస్తున్న భక్తులతో వనాలన్నీ జనమయమయ్యాయి. సమ్మక్క, సారలమ్మకు ప్రీతిపాత్రమైన బెల్లంను బంగారంగా సమర్పించేందుకు క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. జాతర ఏర్పాట్లు, భక్తుల రద్దీ, దర్శనాలు, ట్రాఫిక్ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జాతర ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. 350 సీసీ కెమెరాలు, షీ టీమ్స్‌ను కూడా ఏర్పాటు చేశామన్నారు. రేపు మేడారం సమ్మక్క, సారలమ్మ గద్దెలను సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై దర్శించుకోనున్నారు.













