రేపటి నుంచి మేడారం జాతర
తెలంగాణ కుంభమేళగా పేరుగాంచిన సమ్మక్క సారలమ్మ మేడారం మహా జాతర ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. మంగళవారం కన్నెపల్లె నుంచి పూజారులు జంపన్నను తీసుకొచ్చి గద్దెపై కూర్చోబెడతారు. బుధవారం (5వ తేదీ) మహాజాతర ప్రారంభం అవుతుంది. మొదటి రోజు కన్నెపల్లి నుంచి సారలమ్మను పూజారులు తోడ్కొని, జంపన్న వాగును దాటి వచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. గురువారం సమ్మక్కను చిలుకల గుట్ట మీద నుంచి తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. శుక్రవారం సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు, జంపన్న అంతా గద్దెలపై కొలువై భక్తులకు దర్శనమిస్తారు.













