మేడారం మహా జాతర తేదీలు ఖరారు
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం మహా జాతర తేదీలు ఖరారు అయ్యాయి. 2022, ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకు మేడారం సమ్మక్క-సారలమ్మను జాతరను నిర్వహించనున్నారు. తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో గల ఆదీవాసీ గిరిజన దైవాలు శ్రీ మేడారం సమ్మక్క-సారలమ్మల మహా జాతరను ఆదివాసీ గిరిజన సాంప్రదాయ ప్రకారం మాఘ శుద్ధ పౌర్ణమి రోజున నిర్వహిస్తారు. వచ్చే సంవత్సరం నిర్వహించే జాతర తేదీలను పూజారులు ప్రకటించారు.
ఫిబ్రవరి 16న సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులును గద్దెల తీసుకొస్తారు. 17వ తేదీన చిలకలగుట్ట నుంచి సమ్మక్క దేవతను గద్దెల వద్దకు చేరుస్తారు. 18న సమ్మక్క-సారక్క అమ్మవార్లను ప్రజలు మొక్కలు సమర్పించుకోవడం. ఫిబ్రవరి 19న వన ప్రవేశం, మహా జాతర ముగింపు ఉంటుందని పూజాలు ప్రకటించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా మేడారం పూజారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది మే 1 నుంచి 15 వరకు మేడారం అమ్మవార్ల దర్శనాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.













