అమృత్సర్లో మేయర్ బృందం పర్యటన
అమృత్సర్ను నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్, ఇతర అధికారులతో కూడిన బృందం శుక్రవారం సందర్శించింది. అక్కడి పరిసర ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి నమూనాను పరిశీలించేందుకు వెళ్లిన ఈ బృందం స్వర్ణదేవాలయాన్ని కూడా సందర్శించారు. సుమారు రూ. 160 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన అమృత్సర్ నగర పరివర్తన ప్రాజెక్టు అమలును బృందం స్వయంగా పరిశీలించింది. ఇదే నమూనాలో చార్మినార్ పరిసర ప్రాంతాలు అభివృద్ధి చేస్తామని సిఎం కెసిఆర్ ప్రకటించిన నేపథ్యంలో అధ్యయనం కోసం అమృత్సర్ వెళ్లాలని రాష్ట్ర మున్సిపల్ మంత్రి కె. తారకరామారావు సూచన మేరకు శుక్ర, శనివారాలు రెండురోజుల పాటు అమృత్సర్లో మేయర్ బృందం అధ్యయనం చేయనుంది. పంజాబ్ పర్యాటక, వారసత్వ పరిరక్షణ శాఖ ఆధ్వర్యంల చేపట్టిన ఈ ప్రాజెక్టులో భాగంగా స్వర్ణదేవాలయం చుట్టూ పాత్వేల అభివృద్ధి ఒకే మాదిరిగా ఉన్న దుకాణాలు, స్ట్రీట్ ఫర్నిచర్, వ్యర్థాల నిర్వహణ, వీది ధీపాల ఏర్పాటు తదితర అంశాలను ఈ ప్రతినిధుల బృందం పరిశీలించింది.













