తెలంగాణలో మాయావతి పర్యటన
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీఎస్పీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మాయావతి ఈ నెల 28న రాష్ట్రానికి రానున్నారు. మాయావతి శ్రీరాంపూర్‌లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారని ఆ పార్టీ నేత వీర్‌సింగ్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమం కోసం అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తామన్నారు. కాంగ్రెస్ నాయకులు ఎస్టీ, ఎస్సీల సంక్షేమాన్ని మరిచారన్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి ఆయనే సీఎం కూర్చీ ఎక్కారని ఆగ్రహం వెలిబుచ్చారు. కేసీఆర్ రాష్ట్రంలో ఎస్టీ, ఎస్సీలకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని వీర్ సింగ్ ఆరోపించారు.













