తెలంగాణలో మాయవతి ప్రచారం
ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక ప్రచారంలో పాల్గొంటారు. ఆమె రేపటి నుంచి రెండు రోజుల పాటు మూడు ప్రాంతాల్లో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.బాలయ్య తెలిపారు. నవంబరు 28 ఉదయం 11 గంటలకు నిర్మల్ జిల్లా విశ్వనాథ్ పేట బైల్ బజారులో, మధ్యాహ్నం ఒంటిగంటకు మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లో ప్రగతి స్టేడియంలో సభలు ఉంటాయి. ఆమె 29వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటకు మేడ్చల్ జిల్లా కేంద్రంలోని చెక్‌పోస్ట్ పక్కనే గల ఏజీఎస్ డెవలపర్స్‌లో కార్యక్రమానికి కూడా హాజరవుతారని ఆయన తెలిపారు.













