అత్యాధునిక జర్మన్ వినూత్నత ష్విండ్ అమరిస్ 500ని ప్రవేశపెట్టిన మాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్స్

అధునాతన జర్మన్ టెక్నాలజీని స్వాగతించిన మ్యాక్సివిజన్ మాదాపూర్
మాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్స్ తన అత్యాధునిక వనరులకు సరికొత్త జోడింపు ష్విండ్ అమరిస్ 500ను ప్రకటించినందుకు ఆనందిస్తోంది. అసాధారణమైన దృష్టి సంరక్షణ సేవలను అందించగల మా సామర్థ్యంలో గణనీయమైన పురోగతిని ఇది సూచిస్తుంది. ఈ అత్యాధునిక పరికరాలు మా రోగుల శ్రేయస్సు మరియు వారు సత్వరమే కోలుకునేలా చేయడం పట్ల మా అచంచలమైన నిబద్ధత ను ప్రతిబింబిస్తాయి. మాక్సివిజన్ ఐ హాస్పిటల్స్ కు సంబంధించి హైదరాబాద్‌లో లేజర్ విజన్ కరెక్షన్‌లో ఇది మూడవ అత్యాధునిక సాంకేతికత.
హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్న ఇతర స్టాండర్డ్ లాసిక్ టెక్నాలజీలా కాకుండా, ది ష్విండ్ అమరిస్ 500 మెడికల్ ఇమేజింగ్, డయాగ్నోస్టిక్స్, ట్రీట్‌మెంట్‌లో సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలను అనుసంధానిస్తుంది. ఈ సాంకేతికత కారణంగా వేగవంతమైన లేజర్, 5-D ట్రాకింగ్, ప్రపంచంలోనే అతి చిన్న స్పాట్ సైజు, ఇంటలెక్చు వల్ థర్మల్ ప్రభావ నియంత్రణ, డ్యూయల్ ఫ్లూయెన్స్ వంటి మరిన్ని విశిష్టతలతో, మా వైద్యులు కచ్చితమైన రోగ నిర్ధారణ, కచ్చితమైన చికిత్సల కోసం మెరుగైన సామర్థ్యాలతో సాధికారత పొందారు. రిఫ్రాక్టివ్ లోపాలలో ప్రతి పవర్ కు అనుకూలీకరించిన దిద్దుబాటును ఈ సాంకేతికత అందిస్తుంది.
మాక్సివిజన్ ఐ హాస్పిటల్స్ వ్యవస్థాపకులు, చీఫ్ మెంటర్ అయిన డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘మాక్సివిజన్‌లో మా రోగులకు అత్యున్నత స్థాయి సంరక్షణను అందించడానికి మేం అంకిత భావంతో ఉన్నాం. ఈ నిబద్ధతను నెరవేర్చగల మా సామర్థ్యంలో గణనీయమైన పురోగతి ష్విండ్ అమరిస్ 500. ఒక గ్రూప్ గా మేం 20 మందికి పైగా రిఫ్రాక్టివ్ సర్జన్‌లను కలిగి ఉన్నాం, సగటు అనుభవం 15+ సంవత్సరాలు. నేను 1996 సంవత్సరంలో అత్యంత అధునాతన రిఫ్రాక్టివ్ ఎర్రర్ కరెక్షన్ లాసిక్ టెక్నాలజీ అయిన VICTUSలో ప్రోటోటైప్ పరిశోధనలో భాగమయ్యాను. 1996లో హైదరాబాద్‌లో లాసిక్‌ను ప్రారంభించాం. అందుబాటులో ఉన్న అత్యంత అధునాతన సాధనాలతో మా ఆరోగ్య సంరక్షణ నిపుణులను సన్నద్ధం చేయడం ద్వారా, మా రోగులకు సాధ్యమైనంత ఉత్తమమైన చికిత్స, ఫలితాలు అందేలా మేము వీలు కల్పిస్తున్నాం’’ అని అన్నారు.
మెడికల్ ఎక్సలెన్స్ మరియు ఇన్నోవేషన్‌లో ముందంజలో ఉండటానికి ఆసుపత్రికి గల అంకితభావాన్ని మాక్సి విజన్ ఐ హాస్పిటల్ గ్రూప్ సీఈఓ శ్రీ వి.ఎస్. సుధీర్ నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘ష్విండ్ అమరిస్ 500 ను ఏర్పాటు చేయడం అనేది రోగి సంరక్షణను అభివృద్ధి చేయడంలో మా నిరంతర నిబ ద్ధతను నొక్కి చెబుతుంది. అధునాతన సాంకేతికతలో ఈ పెట్టుబడి అనేక రకాల వైద్య పరిస్థితులను నిర్ధారించ డం మరియు చికిత్స చేయడంలో మా సామర్థ్యాన్ని పెంపొందించడమే కాకుండా, నేత్ర సంరక్షణ రంగంలో అగ్ర గామిగా మా స్థానాన్ని పునరుద్ఘాటిస్తుంది. మాక్సివిజన్ గ్రూప్ ఇప్పుడు దేశవ్యాప్తంగా 50 హాస్పిటల్ నెట్ వర్క్ లలో 11 ఇన్‌స్టాలేషన్‌లను కలిగి ఉంది. ఇది కంటి సంరక్షణ పరిశ్రమలో అతిపెద్ద వాటిలో ఒకటి. కంటి సంరక్షణ సామాన్యులకు చేరువయ్యేలా అత్యుత్తమ సాంకేతికతను తీసుకురావడానికి మాకు గల నిబద్ధతను ఇ ది ప్రదర్శిస్తుంది’’ అని అన్నారు.
మాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్స్ గురించి:
1996లో డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డిచే స్థాపించబడి మరియు 2011లో డాక్టర్ జిఎస్‌కె వేలుచే కొనుగోలు చేయ బ డిన మాక్సివిజన్ భారతదేశంలో అత్యంత ముఖ్యమైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న కంటి సంరక్షణ చెయి న్ హాస్పిటల్స్ లో ఒకటి. అత్యంత అధునాతన, సరసమైన కంటి సంరక్షణ సేవలను అందించడంలో ఇది నిలకడగా తన అంకితభావాన్ని చాటుకుంటోంది. 1996లో ప్రారంభమైన నాటి నుంచి 70 లక్షలకు పైగా రోగులకు తన విశిష్ట సేవలను అందించింది. ప్రస్తుతం ఈ నెట్ వర్క్ దక్షిణ, పశ్చిమ భారతదేశంలో, 5 రాష్ట్రాలలో 48కి పైగా కేంద్రాలను కలిగి ఉంది. ఇంకా విస్తరణ బాటలో ముందుకెళ్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, గుజరాత్‌లలో మాక్సివిజన్ తన ఆసుపత్రుల నెట్‌వర్క్ ను కలిగి ఉంది. ఇప్పుడు మహా రాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలోకి ప్రవేశించింది. మాక్సివిజన్ ఐ హాస్పిటల్ ఒక సమగ్ర విధానాన్ని ఉపయోగిస్తుంది, ఇందులో నాలుగు విభిన్న మైన కేర్ నమూనాలు ఉన్నాయి: సూపర్ టెర్షియరీ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, టెర్టియరీ కేర్ ఐ హాస్పిటల్స్, సెకండరీ కేర్ ఐ హాస్పిటల్స్, ప్రైమరీ ఐ సెంటర్స్ మరియు విజన్ సెంటర్‌లు: మాక్సి విజన్ ఐ హాస్పిటల్స్ అత్యంత అధునాతనమైన, క్లిష్టమైన కంటి సంరక్షణ సేవలను అందించడానికి సన్నద్ధంగా ఉన్నాయి.