నాగంకు ఝలక్…మర్రి జనార్ధన్ రెడ్డికి హైకోర్టులో ఊరట
తెలంగాణలోని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. 2019లో నాగం జనార్దన్ రెడ్డి వేసిన పిటిషన్పై ఇవాళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. మర్రి జనార్దన్ రెడ్డి ఎన్నిక రద్దు చేయాలని నాగం జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. 2018 ఎన్నికల్లో నాగం జనార్దన్ రెడ్డిపై మర్రి జనార్దన్ రెడ్డి గెలిచిన విషయం తెలిసిందే. ఎన్నికల అఫిడవిట్లో మర్రి జనార్దన్ రెడ్డి కొన్ని వివరాలు దాచి పెట్టారని నాగం జనార్దన్ రెడ్డి పిటిషన్ వేశారు. అయితే పిటిషన్లో చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు చూపలేదని పేర్కొంటూ పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది.













