బీఆర్ఎస్ మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థిగా… మన్నె శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ నేతలతో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సమావేశం అయ్యారు. మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థిగా మన్నె శ్రీనివాస్ రెడ్డిని ప్రకటించారు. నాగర్ కర్నూల్ అభ్యర్థిత్వం ఇంకా ఖరారు కాలేదు. బీఎస్పీతో పొత్తు నేపథ్యంలో ఆ స్థానం నుంచి నుంచి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కష్టకాలంలో పార్టీ నుంచి వెళ్తున్న వారిని మళ్లీ చేర్చుకోవద్దని నేతలు కోరారు. దీనిపై స్పందించిన కేసీఆర్ వారిని మళ్లీ తీసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ముఖ్యులతో చర్చించి నాగర్ కర్నూల్ అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు.