అమెరికా ఎన్టీఆర్ ఫౌండేషన్‌కు మన్నవ 2 కోట్ల విరాళం

ఎన్టీఆర్ ట్రస్ట్ అనుబంధ విభాగమైన అమెరికా ఎన్టీఆర్ ఫౌండేషన్‌కు నాట్స్ మాజీ అధ్యక్షుడు, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహన కృష్ణ 2 కోట్లు విరాళం ఇచ్చారు. ఈ మేరకు చెక్కును ఉండవల్లిలోని తెదేపా అధినేత చంద్రబాబునాయుడును కలిసి అందజేశారు.
ఈ సందర్భంగా మన్నవ మోహనకృష్ణ మాట్లాడుతూ.. చంద్రబాబు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తోందన్నారు. ఎంతోమంది పేద విద్యార్థులను చదివిస్తోందని.. ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంకు ద్వారా వేలాదిమందికి రక్తదానం చేస్తోందంటూ కొనియాడారు. ఎన్టీఆర్ సుజల పథకంతో తాగునీరు లేని ఎన్నో గ్రామాలకు మంచినీటి వసతి కల్పిస్తోందని చెప్పారు. ఉచిత మెడికల్ క్యాంపుల నిర్వహణతో పాటు పేదవారికి పలు సేవలందిస్తోన్న ఎన్టీఆర్ ఫౌండేషన్‌కు రూ.2 కోట్లు విరాళంగా ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
అమెరికాలోని తెలుగువారు సైతం అమెరికా ఎన్టీఆర్ ఫౌండేషన్‌కు సహాయసహకారాలు అందిస్తే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మనం ఎంతోమంది పేదవారికి సహాయం చేసిన వాళ్ళమవుతామని మోహనకృష్ణ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఐ టీడీపీ అధ్యక్షుడు వేమూరి రవి, ఎన్టీఆర్ ఫౌండేషన్ బోర్డు ఛైర్మన్ గొట్టిపాటి శ్రీధర్ పాల్గొన్నారు. అమెరికా ఎన్టీఆర్ ఫౌండేషన్‌కు రూ.2 కోట్లు విరాళంగా ఇచ్చిన మోహన కృష్ణను చంద్రబాబు అభినందించారు.