తెలంగాణలో బీఆర్ ఎస్ తో పొత్తు ఉండదు
తెలంగాణలో బీఆర్ఎస్తో పొత్తు ఉండదు, ఈ విషయంలో పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ ఇప్పటికే స్పష్టత ఇచ్చారని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రే తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దళిత సీఎం అనే చర్చ కాంగ్రెస్‌లో లేదని, కాంగ్రెస్ అన్ని వర్గాలను ఆదరిస్తుందని తెలిపారు. దళిత సీఎం అనే చర్చ కాంగ్రెస్‌లో ఏనాడూ జరగలేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం. కాంగ్రెస్ అన్ని వర్గాలను ఆదరిస్తుందని పేర్కొన్నారు. ఏలేటి మహేశ్వరెడ్డి బీజేపీలో చేరికపైనా ఠాక్రే స్పందించారు. మహేశ్వర్‌రెడ్డికి కాంగ్రెస్ ఏం తక్కువ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఆయనకు సముచిత స్థానం కల్పించింది. ఆయన పార్టీని ఎందుకు వీడారో చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు.













