నాంపల్లి కోర్టు సంచలన తీర్పు….
నాంపల్లి పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. లైంగికదాడి కేసులో ఇద్దరు నిందితులకు 20 ఏండ్లు జైలుశిక్ష విధించింది. మైనర్ బాలికలపై లైంగిక దాడులు చేసిన ఇద్దరు వ్యక్తులకు వివిధ కేసుల్లో న్యాయస్థానం 20 ఏండ్లు కఠిన కారాగార శిక్ష విధించింది. 2017లో లాలాగూడ పీఎస్ పరిధిలో ఐదేళ్ల చిన్నారి ట్యూషన్ కి వెళ్తుండగా ప్రభాకర్ అనే వ్యక్తి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించి తల్లిదండ్రులు లాలాగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరో కేసులో 2018లో యూసూఫ్‌గూడలో నాలుగేళ్ల చిన్నారి షాపింగ్‌కు వెళ్లి వస్తుండగా నిందితుడు లైంగికదాడాకి ప్రయత్నించారు. ఆ ఘటన సంబంధించి తల్లిదండ్రులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ రెండు వేర్వేరు ఘటనలలో నాంపల్లి పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితునికి 20 ఏండ్లు జైలుశిక్షతోపాటు ఒక నింధితుడికి రెండు వేల రూపాయలు.. మరో నింధితుడికి 12 వేల రూపాయల జరిమానా విధించింది.













