బెంగాల్లో మమత రాజ్యాంగం… తెలంగాణలో కేసీఆర్ రాజ్యాంగం
పశ్చిమబెంగాల్లో మమత బెనర్జీ రాజ్యాంగం, తెలంగాణలో కేసీఆర్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భారత రాజ్యాంగం రచించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 130వ జయంతిని ఘనంగా జరుపుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం వ్యవహరించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడతామని హామీ ఇచ్చారని అది ఇంత వరకు అమలు కాలేదని అన్నారు.













