ప్రగతి భవన్ లోనే భద్రత అంటే.. సామాన్యుల పరిస్థితి : మల్లు
ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న అభద్రతా భావంతో మాట్లాడారని, భవిష్యత్‌లో అధికారంలోకి రావడం కల అన్నట్లు మాట్లాడారని తెలంగాణ పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ కుమార్తె కవితను బీజేపీలోకి రావాలని అడుగుతున్నారని అనడం అందుకు నిదర్శనమన్నారు. గవర్నర్ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెబితే నమ్మలేదని, కానీ నిన్న సీఎం మాటాలతో నిజమని అర్థమైందన్నారు. పార్టీ మారమని అడిగితే చెప్పుకో కొట్టాలని అంటున్న కేసీఆర్ 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎలా విలీనం చేసుకున్నారని ఆయన ప్రశ్నించారు. మరి కేసీఆర్‌ను దేంతో కొట్టాలన్నారు. ఎమ్మెల్యేను భయపెట్టడానికే నిన్న సమావేశం పెట్టరా అని ప్రశ్నించారు. ప్రగతి భవన్‌లోనే భద్రత అంటే సామాన్యుల పరిస్థితి ఏంటన్నారు. కరీంనగర్లో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను యువకులు చెప్పులతో కొట్టారన్నారు. రోడ్లు లేవని నిరసన తెలుపుతున్న వాళ్ళపై కేసులు పెట్టారన్నారు. అచ్చంపేటలో ఎమ్మెల్యే వంద కోట్లు తీసుకుని అమ్ముడు పోయారని ఎవరో పోస్టర్లు వేస్తే పోలీసులు కాంగ్రెస్ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.













