తాము ఆనాడే చెప్పాం.. కానీ మాట వినలేదు
పోలవరం కడితే 2 లక్షల ఎకరాల భూమి గిరిజన గ్రామాలు మునుగుతాయని తాము ఆనాడే చెప్పామని కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన బిల్లు నుంచి ఏడు మండలాలు తొలగించి కాంగ్రెస్ బిల్లు పాస్ చేసిందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత టీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఏడు మండలాలు ఆంధ్రలో కలిపారని తెలిపారు. ఏడు మండలాలు ఏపీలో కలుపొద్దని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశామన్నారు. ఆ తీర్మానాన్ని అసలు కేంద్రానికి పంపించారా లేదా? ఇన్నేళ్లు ఎందుకు ఏడు మండలాల కోసం పోరాటం చేయలేదు? అని ఆయన ప్రశ్నించారు.
అఖిల పక్షానికి ఎందుకు ఢిల్లీ తీసుకువెల్లలేదని కూడా ప్రశ్నించారు. కాపర్ డ్యాములు కడుతుంటే మీరెందుకు ఆపలేదన్నారు. ఏడు మండలాలు ఎలా వెనక్కి తెస్తారో చెప్పాలని, అప్పటి మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ 3 వేల ఎకరాలు ముగినితే అంగీకరించ లేదన్నారు. మీరు 2 లక్షలు ఎకరాలు మింగుతుంటే ఎలా అంగీకరించారు? అని ప్రశ్నించారు. ఫడ్నవీస్‌కు మహారాష్ట్ర మీద ఉన్న ప్రేమ మీకు తెలంగాణ మీద లేదా? అని ప్రశ్నించారు. పాలకులు ప్రజా సమస్యల నుంచి డైవర్ట్ చేసేలా బాధ్యతారహితంగా మాట్లాడొద్దన్నారు.













