బీఆర్ఎస్ కు మైనంపల్లి రాజీనామా
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీకి సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రాజీనామా చేశారు. గత కొన్ని రోజులుగా పార్టీకి దూరంగా ఉంటున్న ఆయన రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాను బీఆర్ఎస్ రాజీనామా చేస్తున్నాని మీడియా ద్వారా ప్రకటించారు. కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, సన్నిహితుల సూచన మేరకు రాజీనామా చేస్తున్నట్లు మైనంపల్లి వెల్లడించారు. త్వరలోనే మరో పార్టీలో చేరుతానని, ఆ పార్టీని త్వరలోనే ప్రకటిస్తానని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
మల్కాజిగిరి అసెంబ్లీ టికెట్‌ను మైనంపల్లి మనుమంతరావుకు సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తన కుమారుడికి కూడా మెదక్ టికెట్ కావాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధిష్ఠానం మైనంపల్లి హనుమంతరావుకు మాత్రమే టికెట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో తన ప్రతిపాదనను అడ్డుకున్నా మంత్రి హరీష్ రావుపై మైనంపల్లి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇక తాజాగా బీఆర్ఎస్కు మైనంపల్లి రాజీనామా చేశారు.













