మాజీ గవర్నర్ విద్యాసాగర్ కీలక వ్యాఖ్యలు.. రెండవ రాజధానిగా
భారత దేశానికి హైదరాబాద్ రెండవ రాజధాని అయ్యే అవకాశం ఉందని బీజేపీ సీనియర్ నేత మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ రెండవ రాజధాని అవుతుందనే నమ్మకం నాకు ఉందన్నారు. రాజ్యాంగంలో ఈ అంశం కూడా ఉందని గుర్తు చేశారు. ఈ అంశంపై అన్ని పార్టీలు కలిసి రావాలని చర్చ జరగాలన్నారు. తెలంగాణ బీజేపీలో ఏలాంటి ఇబ్బందులు లేవని ఏమైనా ఉంటే కేంద్ర అధిస్టానం చూసుకుంటుందని తెలిపారు. దేశంలో మళ్లీ బీజేపీ గెలుస్తుందని మళ్లీ మోదీ ప్రభుత్వం వస్తుందని అన్నారు. కొన్ని ఓట్లు జాయింగ్ అకౌంట్లో ఉన్నాయని వాటిని విడిపించుకునే సత్తా మా నాయకులకు ఉందన్నారు.













