Mynampally : అవసరమైతే సిద్దిపేట బరిలో నేనే దిగుతా: మైనంపల్లి
వచ్చే ఎన్నికల్లో మాజీ మంత్రి హరీశ్‌రావుకు (Harish Rao) ప్రత్యర్థిగా దీటైన అభ్యర్థి దొరక్కపోతే కాంగ్రెస్ పక్షాన తానే బరిలో దిగుతానని, ఆయన్ను ఓడించితీరతానని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు (Mynampally Hanumantha Rao) పేర్కొన్నారు. మెదక్ జిల్లా (Medak district) నిజాంపేటలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లను ఆయన సన్మానించారు. అనంతరం జరిగిన సమావేశంలో హనుమంతరావు మాట్లాడారు. రాష్ట్రంలో రాబోయేది మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. తానే సీఎం అవుతానంటూ కలలు కనడాన్ని హరీశ్ మానుకోవాలని సూచించారు. పదేళ్లు తెలంగాణను ఏలిన బీఆర్ఎస్ పంచాయతీ వ్యవస్థను భ్రష్టు పట్టించిందని మండిపడ్డారు.






