ప్రియాంక గాంధీ రాష్ట్రానికి వస్తారు.. ఎవరు అడ్డుకుంటారో చూస్తాం
ప్రియాంక గాంధీ బరాబర్ రాష్ట్రానికి వస్తారు, ఆమెను ఎవరు అడ్డుకుంటారో చూస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలు చౌకబారు విమర్శలు చేస్తున్నారని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఆ పార్టీ పరిపాలన పట్ల ప్రజలకు విసుగొచ్చి ఇంటికి పంపారని విమర్శించారు. పరిపూర్ణమైన అధికార దుర్వినియోగానికి పాల్పడిన బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. తొమ్మిదిన్నరేళ్లలో కేసీఆర్ కుటుంబం చేసిన దోపిడీ మామూలుగా లేదు. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు తేడా లేకుండా చేసింది వారి హయాంలోనే కాళేళ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి సహా అన్ని లెక్కలు బయట పెడతాం. తెలంగాణ ఉద్యమంలో ఎంతో కష్టపడిన కోదండరామ్‌కు ఎమ్మెల్సీ పదవి ఇస్తుంటే అడ్డుకుంటున్నారు అని విమర్శించారు.













