మంత్రి కేటీర్ ని కలిసి ఎన్నారైల తరపున ధన్యవాదాలు తెలిపిన మహేష్ బిగాల
తెరాస ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారిని ఈరోజు ప్రగతి భవన్ లో కలిసి ఎన్నారై ల తరపున ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ధరణి ప్రారంభించిన తరువాత ఎన్నారై ల నుంచి చాల మంచి స్పందన వచ్చింది , దేశ విదేశాలలో వున్నా అందరూ అక్కడినుంచే వారి వారి భూముల వివరాలు తెలుసుకునే వెసులుబాటు కల్పించినందుకు ఎన్నారై ల తరపున మంత్రి కేటీర్ గారికి ధన్యవాదాలు తెలిపారు అలాగే ఎన్నారై ల భూములకు కూడా ఆధార్ లేకుండా ప్రక్రియ OCI కార్డు ద్వారా చేసుకోవచ్చు అని సీఎం గారు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు దాని గురించి త్వరిత గతిన రూపకల్పన చెయ్యాలని విజ్ఞప్తి చేసారు. గల్ఫ్ పాలసీ ఫై త్వరలో ఒక సముచితమైన నిర్ణయం తీసుకొని అధికారక ప్రకటన చేయాలనీ కోరారు.













