అట్లాంటా లో నవంబర్ లో శ్రీ పివి గారి విగ్రహ ప్రతిష్టాపనకు ఏర్పాట్లు
ఎన్నారై కోఆర్డినేటర్, పీవీ కమిటి సభ్యులు మహేష్ బిగాల ఈరోజు ప్రగతి భవన్ లో మాన్య ముఖ్యమంత్రి సీఎం కెసిఆర్ గారిని మర్యాద పూర్వకంగా కలిశారు, ఈ సమావేశములో పీవీ శత జయంతి ఉత్సవాల విగ్రహ ప్రతిష్టాపన గురించి వివిధ దేశాలలో నిర్వహించే ప్రక్రియ గురించి తెలియ జేశారు,ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఐదు దేశాలలో పీవీ విగ్రహాలని స్థాపించాలని నిర్ణయించారు. అమెరికా పర్యటన ముగించుకున్న మహేష్ బిగాల అక్కడ వివరాలను తెలియజేస్తూ నవంబర్లో అమెరికాలోని అట్లాంటాలో దివంగత మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు ఈ మేరకు స్థల పరిశీలన జరిగినట్లు తెలిపారు, ఆవిష్కరణ కార్యక్రమానికి తెలంగాణ నుంచి ప్రముఖుల్ని, పీవీ కుటుంబ సభ్యులను ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. అమెరికాలోని తెలుగు, ఇండియన్ డియాస్పోరా కాకుండా సెనెటర్, మిగతా ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా పీవీ జయంతి ఉత్సవాలు జరిగిన పని తీరును ఈ సందర్బంగా మహేష్ బిగాల ని సీఎం కెసిఆర్ అభినందించారు.













