మాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ నేత్ర వైద్యశాలలతో నివారించదగిన అంధత్వ చైతన్యం కోసం సారధ్యం వహించిన మహేంద్ర సింగ్ ధోనీ
మాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ నేత్ర వైద్యశాలలు దిగ్గజ ఇండియన్ క్రికెటర్ ,మహేంద్ర సింగ్ ధోనీని తమ గౌరవనీయమైన బ్రాండ్ అంబాసిడర్ గా ఆనందంగా ప్రకటించింది. క్రికెట్ మైదానంలో తన సాటిలేని నాయకత్వానికి ‘కెప్టెన్ కూల్’ గా ప్రసిద్ధి చెందిన పిలుపుతో సూచించబడే ఎంఎస్ ధోనీ విశ్వసనీయత, నమ్మకం, శ్రేష్టతల వంటి గుణాలకు ఉదాహరణగా నిలిచారు. ఇవి మాక్సివిజన్ వారి ప్రధానమైన విలువలు మరియు సిద్ధాంతానికి అనుగుణంగా ఉండి, నివారించదగిన అంధత్వం గురించి చైతన్యం కలిగించి, అవగాహన కలిగించే మిషన్ కు పరిపూర్ణమైన అంబాసిడర్ గా నాయకత్వంవహించడానికి కారణమయ్యాయి.
కంటిచూపు సంరక్షణ గురించి ముందస్తుగా చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందనడం అతిశయోక్తి కాదు. ముందస్తుగా నివారణ చర్యలు తీసుకోవడం సరిదిద్దే పరిష్కారాలు కంటే ఎక్కువ ప్రభావంగా ఉండటమే కాకుండా సమస్యలు మరియు కంటిచూపు వ్యాధులను ఆరంభ దశలలో నివారించడంలో కూడా సహాయపడతాయి. ఇది ప్రత్యేకించి ప్రధానమైనది ఎందుకంటే వివిధ ఆరోగ్య పరిస్థితుల వ్యవస్థలైన డయాబిటీస్, అధిక రక్తపోటు, ధైరాయిడ్ వ్యాధులు మరియు పొగ తాగడం వంటి జీవన శైలి ఎంపికలు తాత్కాలికంగా లేదా శాశ్వతంగా కంటిచూపు కోల్పోవడానికి తోడ్పడతాయి.
ఈ చొరవలో భాగంగా, క్రమం తప్పకుండా కళ్లను పరీక్షించుకోవడం యొక్క ప్రాధాన్యతను మాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్స్ చెబుతున్నాయి మరియు వాటిని ఇతర కీలకమైన నివారణ ఆరోగ్య సంరక్షణ అంశాలతో పోలుస్తున్నాయి. ఎంఎస్ ధోనీని బ్రాండ్ అంబాసిడర్ గా నియామకం చేయడం విస్తృతంగా ఈ కీలకమైన సందేశాన్ని వ్యాప్తి చేయడానికి ఒక శక్తివంతమైన సాధనంగా పని చేస్తుందని హాస్పిటల్ వర్గాలు ఆత్మవిశ్వాసంతో ఉన్నాయి. ఎంఎస్ ధోనీ దిగ్గజ హోదా మరియు ఆకర్షణలు భారీ స్థాయిలో చైతన్యాన్ని కలిగించడంలో సహాయపడతాయి, తమ కంటి ఆరోగ్యానికి ప్రాధాన్యతనివ్వడంలో మరియు సకాలంలో వైద్య సహాయం తీసుకోవడంలో ప్రోత్సహిస్తాయి. ఆసుపత్రితో ఆయకు ఉన్న అనుబంధం ఆర్థిక అడ్డంకులను అధిగమించి, సమాజంలోని అన్ని వర్గాల ప్రజల కోసం సరసమైన మరియు అందుబాటులో ఉండే కంటి సంరక్షణ ప్రాధాన్యతను తెలియచేస్తుంది.
కాంపైన్ ద్వారా మరియు మాక్సివిజన్ ఐ హాస్పిటల్స్ యొక్క నిరంతర ప్రయత్నాలతో, నివారించదగిన అంధత్వం అనేది తక్కువ బాధాకరంగా మారుతుందని మరియు కంటిచూపు వరం మరింత మందికి వాస్తవంగా మారి ఆరోగ్యవంతమైన మరియు ఉత్సాహవంతమైన సమాజానికి తోడ్పడుతుందని ఆశించబడింది.
ఎంఎస్ ధోనీ ఇలా అన్నారు, “ఖచ్చితత్వం సర్వోన్నతంగా ఉండే క్రీడల్లో కంటిచూపు అనేది విజయానికి కీలకమైనది. స్పష్టమైన కంటిచూపు యొక్క ప్రాధాన్యత క్రీడా రంగానికి మించి విస్తరించింది. మాక్సివిజన్ వారి నినాదం, “ కళ్లు మాట్లాడతాయి. మనం వింటాము’ అనుసరించి మీ యొక్క అత్యంత విలువైన వరం – మీ కంటిచూపు గురించి సంరక్షణవహించడానికి మేము కట్టుబడ్డాము. క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవడం మరియు అనుకూలమైన కంటిచూపు ఆరోగ్యాన్ని నిర్వహించడం జీవితంలో శ్రేష్టతను సాధించడానికి సమానమైన ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి. తమ కంటిచూపు ఉత్తమంగా నిలిచి ఉండటం నిర్థారించడానికి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా క్రీడలు మరియు ఆరోగ్యంగా జీవించడానికి ప్రాధాన్యత ఇవ్వాలి.”
ఈ విషయం పై డాక్టర్ జీఎస్కే వేలు, మాక్సివిజన్ ఐ హాస్పిటల్స్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరక్టర్ ఇలా అన్నారు, “ఎంఎస్ ధోనీ మా బ్రాండ్ అంబాసిడర్ గా మాతో చేరడం మాకు అత్యంత ఉల్లాసంగా ఉంది. ఆయన దిగ్గజ హోదా మరియు శ్రేష్టతకు ఆయన నిబద్ధతలు నివారించదగిన అంధత్వంతో పోరాడటానికి మా మిషన్ యొక్క పరిపూర్ణమైన ప్రతినిధిని చేసాయి. ఈ సహకారంతో, మేము గొప్ప చైతన్యం కలిగించి, సరసమైన మరియు అందుబాటులో ఉండే కంటి సంరక్షణ సమాజంలోని అన్ని వర్గాల వారికి నిజం చేసే లక్ష్యాన్ని కలిగి ఉన్నాము. “
సుధీర్ వీఎస్, మాక్సివిజన్ ఐ హాస్పిటల్స్ గ్రూప్ సీఈఓ ఇలా అన్నారు, “మా 40+ నెట్ వర్క్ ఆసుపత్రులలో, ప్రతిరోజు మాక్సివిజన్ వేలాదిమంది రోగులకు విస్తృత శ్రేణి కంటి సంరక్షణ సేవలు కేటాయిస్తుంది. క్షుణ్ణంగా పరీక్షలు చేసిన తరువాత తమ కంటిచూపు, జీవన శైలి మరియు ప్రొఫెషన్ పై కీలకమైన అంశాలు ప్రభావం చూపిస్తున్నాయని గణనీయమైన ఈ రోగుల సంఖ్య తెలియచేస్తోంది. గ్లకోమా, రెటినా సమస్యలు వంటి పురోగమించిన కంటి వ్యాధులతో బాధపడుతున్న రోగులకు మా వైద్య నిపుణులు తరచుగా చికిత్సలు అందిస్తూ పూర్తి స్థాయి కంటిచూపు సామర్థ్యాన్ని అందించడానికి కేవలం పరిమితమైన అవకాశాన్ని మాత్రమే కలిగి ఉంటారు. ఒక అలవాటుగా నివారణా కంటి సంరక్షణ పరీక్షలు చేయడం ద్వారా అధికసంఖ్యాకంగా ఉన్న ఈ కంటి వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి. మాక్సివిజన్ నివారణ కంటి సంరక్షణను ప్రోత్సహించే లక్ష్యాలు కలిగిన వివిధ రకాల ఆన్ లైన్, ఆఫ్ లైన్, మరియు ఆన్ – గ్రౌండ్ చొరవలను చురుకుగా పాల్గొంటోంది. నివారణ కంటి సంరక్షణ ప్రాధాన్యతను మద్దతు చేయడానికి ఎంఎస్ ధోనీ వంటి ప్రముఖ దిగ్గజాలను కలిగి ఉండటం ద్వారా, ఒక అలవాటుగా ప్రజలు కంటి పరీక్షలు చేయించుకునే విధానాన్ని గణనీయంగా పునః రూపొందిస్తుంది.”
మాక్సివిజన్ మిషన్ అందరికీ సరసమైన, అందుబాటులో ఉండే కంటి సంరక్షణను కేటాయిస్తుంది మరియు మా అంకితభావంతో పని చేసే అనుభవజ్ఞులైన డాక్టర్స్ సరికొత్త టెక్నాలజీని జోడింటి ఈ లక్ష్యం దిశగా మా నిబద్ధతను చూపిస్తున్నారు. ప్రతి ఒక్కరు 30 సంవత్సరాల అనుభవాన్ని కలిగిన ఆరుగురు విశ్వశనీయమైన భాగస్వామ్యులతో మేము కంటి సంరక్షణ రంగంలో 150 సంవత్సరాల నైపుణ్యాన్ని జోడించాము. మేము పురోగమిస్తున్న సందర్భంలో, వివిధ ప్రదేశాల్లో 10కి పైగా భాగస్వామ్యులను ఆహ్వానించి, అదనపు పేరు ప్రతిష్టలు, నైపుణ్యాలతో మా సమూహాన్ని మెరుగుపరచాలని ఆశిస్తున్నాము. మాక్సివిజన్ ఐ హాస్పిటల్ కంటి సంరక్షణ సేవలను అభివృద్ధి చేయడంలో ముందంజలో ఉన్నందుకు గర్వంగా ఉంది, మరియు మా బ్రాండ్ అంబాసిడర్ గా మహేంద్ర సింగ్ ధోనీ మద్దతు మరియు డాక్టర్. జీఎస్కే వేలు నాయకత్వంతో, భారతదేశంలో నివారించదగిన అంధత్వం పై ఇంతకు ముందు లేని విధంగా గణనీయమైన ప్రభావం చూపించాలని మేము నిర్ణయించాము.
మాక్సివిజన్ గురించి :
మాక్సివిజన్ ఐ ఆసుపత్రిని 1956లో డాక్టర్. కాసు ప్రసాద్ రెడ్డి స్థాపించారు మరియు 2011లో డాక్టర్ జీఎస్కే వేలు సొంతం చేసుకున్నారు, ఆసుపత్రి భారతదేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న నేత్ర వైద్యశాలల్లో ఒకటిగా నిలిచింది. ఉన్నతమైన, సరసమైన కంటిచూపు సంరక్షణ సేవలను అందచడానికి తమ అచంచలమైన అంకితభావంతో మాక్సివిజన్ స్థిరంగా పని చేస్తోంది. 1996లో ఆరంభించిన నాటి నుండి, ఇది సగర్వంగా 5 మిలియన్ లకు పైగా ప్రజలకు సేవలు అందించింది . ప్రస్తుతం, నెట్ వర్క్ నిరంతర వృద్ధితో, దక్షిణ మరియు పశ్చిమ భారతదేశం రాష్ట్రాలలో 45+కి పైగా కేంద్రాలకు విస్తరించింది. మాక్సివిజన్ ఐ హాస్పిటల్ సమగ్రమైన విధానం వినియోగించి, నాలుగు విలక్షణమైన సంరక్షణ మోడల్స్ ను అనుసరిస్తుంది : సూపర్ టెర్షియారి సెంటర్స్ ఆఫ్ ఎక్స్ లెన్స్, టెర్షియారి కేర్ ఐ హాస్పిటల్స్, సెకండరి కేర్ ఐ హాస్పిటల్స్, ప్రైమరీ ఐ సెంటర్స్, మరియు విజన్ సెంటర్స్ : అత్యంత ఆధునికమైన మరియు కీలకమైన కంటి సంరక్షణ సేవలను కేటాయించడానికి మాక్సివిజన్ ఐ హాస్పిటల్స్ సకల సదుపాయాలు కలిగి ఉన్నాయి.













