కాంగ్రెస్ లో చేరిన మహబూబ్‌నగర్ జడ్పీ ఛైర్‌పర్సన్

మహబూబ్‌నగర్ జడ్పీ ఛైర్‌పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమెకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఇటీవల కాంగ్రెస్‌లోకి నేతల వలసలు పెరిగాయి. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తదితరులు ఆ పార్టీలో చేరారు.