మండలిలో బీఆర్‌ఎస్ పక్ష నేతగా మధుసూదనాచారి

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. శాసనమండలిలో బీఆర్‌ఎస్ పక్ష నేతగా మధుసూదనాచారి వ్యవహరించనున్నట్లు ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. నేను అగ్నిపర్వంతంలా ఉన్నా. రాజకీయ కక్షతోనే నా కుమార్తెను జైళ్లో పెట్టారు. కన్నబిడ్డ జైళ్లో ఉంటే తండ్రిగా బాధ ఉండదా? ఎక్కడో ఉన్న వారిని నేతలను చేస్తే పదువుల వచ్చాక పార్టీని వీడుతున్నారు. వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని కేసీఆర్ అన్నారు.