గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా మధుసూధనాచారి ఎన్నిక
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా మధుసూధనాచారి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. ఉద్యమంలో కేసీఆర్తో సుదీర్ఘకాలం పని చేసినందుకే ఈ అవకాశం దక్కిందన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజ్లోకి తీసుకెళ్తానని తెలిపారు.
గవర్నర్ కోటా నామినెటేడ్ ఎమ్మెల్సీగా సిరికొండ మధుసూదనాచారి శాసనమండలికి ప్రాతినిధ్యం వహించనున్నారు. గతంలో ఈ కోటా నుంచి ఎమ్మెల్సీగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి పదవీకాలం ఈ ఏడాది జూన్ 16తో ముగిసింది. ఆయన స్థానంలో మధుసూదనాచారి పేరును ప్రతిపాదిస్తూ రాష్ట్ర మంత్రివర్గం చేసిన సిఫారసును గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోదించారు. మధుసూదనాచారిని మండలికి నామినేట్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో ఇవాళ్టి నుంచి మధుసూదనాచారి పదవీకాలం ప్రారంభం కానుంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు వెలువరించింది.













