తెలంగాణలో పోటీ చేస్తా : శివాజీ రాజా
తాను రాజకీయాల్లోకి వస్తానని ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ శివాజీ రాజా తెలిపాడు. గత 20 ఏళ్లుగా తాను బీజేపీలో ఉన్నానని, ప్రతి ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేస్తున్నానని అన్నారు. కృష్ణంరాజుగారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడే తాను బీజేపీలో చేరానని అన్నారు. రామానాయుడకు కూడా ప్రచారం చేశానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పుట్టినా కేవలం 15 ఏళ్లు మాత్రమే అక్కడ ఉన్నానని, తరువాత జీవితమంతా తెలంగాణలోనేనని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే ఇష్టమని చెప్పాడు. అయితే ఆయనపై అభిమానంతో ఆ పార్టీవైపు చూసే ప్రసక్తి లేదని చెప్పాడు. బీజేపీ తరపునే పోటీ చేయాలని ఉందని అన్నాడు. ఇప్పటికైతే ఆఫర్ ఉందని చెప్పాడు. పార్టీ ఆదేశాల మేరకు పని చేస్తానని అన్నాడు. నిజాయితీగా, ముక్కుసూటిగా, మంచితనంగా ఉండడం పనికిరాదని తన స్నేహితులంతా చెబుతుంటారని, అయితే ఆ లక్షణాలే తనను మా అధ్యక్షుడిని చేశాయని, ఆవే లక్షణాలతో తాను రాజకీయాల్లోకి వస్తానని తెలిపాడు.













