లండన్లో బతుకమ్మ ఉత్సవాలు
లండన్లో నిర్వహించే చేనేత బతుకమ్మ, దసరా సంబరాల పోస్టర్ను ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు. ఈ మేరకు హైదరాబాద్లోని తన నివాసంలో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ ప్రతినిధుల సమక్షమంలో పోస్టర్ను విడుదల చేశారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ ఆధ్వర్యంలో అక్టోబర్ 1న ఘనంగా చేనేత బతుకమ్మ వేడుకలను నిర్వహించనున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు కవితకు తెలిపారు. లండన్లో నిర్వహించే బతుకమ్మ ఉత్సవాలకు హాజరు కావాలని ఈ సందర్భంగా వారు ఎమ్మెల్సీ కవితను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్ అనిల్ కూర్మాచలం, టీఎస్ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.













