తెలంగాణలో మే 21 వరకూ లాక్డౌన్ ?
తెలంగాణలో లాక్డౌన్ మరో రెండు వారాలు పొడిగించే అవకాశాలున్నాయి. రేపు (5వ తేదీ) కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో లాక్డౌన్ సడలింపులపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. గ్రీన్, ఆరంజ్ జోన్లలో మద్యం అమ్మకాలకు కేసీఆర్ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఆరెంజ్, గ్రీన్ జోన్ జిల్లాల్లో రవాణా సౌకర్యాలతో పాటు ఇతర సడలింపులు ఇచ్చే అవకాశం ఉంది. నిర్మాణ రంగానికి సంబంధించి కూడా సడలింపులుంటాయని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. తెలంగాణలో రెండో విడత లాక్డౌన్ ఈ నెల ఏడున ముగియనుంది. మరో రెండు వారాలు పొడిగించే అవకాశం ఉండటంతో తెలంగాణలో ఈ నెల 21 వరకూ లాక్డౌన్ ఉంటుంది. అయితే దీనిపై సీఎం కేసీఆర్ అధికారిక ప్రకటన చేస్తారని తెలుస్తోంది.













