తెలంగాణలో లాక్‌డౌన్ పొడగింపు

తెలంగాణలో లాక్‌డౌన్‌ను పొడగిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 30 వరకూ లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు సర్కార్ ప్రకటించింది. అందుకు అనుగుణంగా జీవోను విడుదల చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. కేబినెట్ మంత్రులందరితో సీఎం కేసీఆర్ ఇదే విషయంపై ఫోన్లో మాట్లాడి, వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఈ నెల 20న జరగాల్సిన కేబినెట్ సమావేశాన్ని సీఎం కేసీఆర్ రద్దు చేశారు. తొలుత తెలంగాణలో పది రోజుల పాటు లాక్‌డౌన్ విధించారు. ఈ గడువు శుక్రవారంతో ముగుస్తోంది.