30 వరకు లాక్డౌన్
తెలంగాణలో లాక్డౌన్ జూన్ 30 వరకు పొడిగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. లాక్డౌన్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా ఆదేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రగతిభవన్లో ఉన్నతాధికారులతో చర్చించారు. కంటెయిన్మెంట్ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం సూచించిన సడలింపులను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. రాత్రిపూట కర్ఫ్యూ కూడా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5గంటల వరకు అమలు చేయాలని ఆదేశించారు. షాపులను రాత్రి 9 గంటల వరకు మాత్రమే తెరచి ఉంచాలని కోరారు.
ఇతర రాష్ట్రాల రాకపోకలు కూడా ఎలాంటి నియంత్రణ అవసరం లేదని చెప్పారు. ఇప్పటి వరకు ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి రావాలన్న నిబంధలను ఉండేవి. ప్రస్తుతం అంటే జూన్ 1 నుంచి ఇతర రాష్ట్రాల్లోని ప్రజలు తెలంగాణలోకి వచ్చేందుకు ఎలాంటి ఆంక్షలు ఉండవు. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలోనే నడుస్తున్న ఆర్టీసీ బస్సులు సోమవారం నుంచి ఇతర రాష్ట్రాలకు నడపనున్నారు. అయితే హైదరాబాద్ నగరంలో సిటీ బస్సులు నడిపే విషయంపై సృష్టత ఇవ్వలేదు.













