లాక్‍డౌన్ నుంచి వీటికి మినహాయింపు…

తెలంగాణ రాష్ట్రంలో లాక్‍డౌన్ నుంచి పెట్రోల్ బంకులకు రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. గ్రామాలు, పట్టణాల్లో పెట్రోల్ బంకులు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సాగు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ధాన్యం సేకరణ, అవసరాల కోసం వినియోగించే వాహనాలకు మినహాయింపు ఇచ్చారు. హైవేలపై పెట్రోల్ బంకులను ఇప్పటికే మినహాయింపు ఉండగా, తాజాగా గ్రామాలు, పట్టణాల్లో ఉండే బంకులను కూడా తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో మే 30 వరకు లాక్‍డౌన్ పొడిగించిన సంగతి తెలిసిందే.