హైదరాబాద్ మెట్రో మరో ఘనత … 25 నిమిషాల్లో
హైదరాబాద్ మెట్రో రైలు మరో ఘనత సాధించింది. గుండెను యుద్ధ ప్రాతిపదికన మార్చేందుకు వరంలా మారింది మెట్రో రైల్. గుండెను దానంగా ఇవ్వటానికి ఒప్పుకోవటంతో జూబ్లీహిల్స్ లోని మరో రోగికి పునర్జన్మను ఇచ్చినట్లైంది. నల్గొండ జిల్లాకు చెందిన 33 ఏళ్ల వ్యక్తికి మెదడుకు తీవ్ర గాయమైంది. దీంతో ఎల్బీ నగర్‌లోని కామినేని ఆసుపత్రికి తరలించగా ఆరోగ్యం విషమించి బ్రెయిన్ డెడ్ అయ్యాడు. కుటుంబ సభ్యులు అతడి కిడ్నీలు గుండె కాలేయం కార్నియాను దానం ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. అదే సమయంలో మూత్రపిండాలు గుండె దెబ్బ తిని చికిత్స పొందుతున్న 32 ఏళ్ల వ్యక్తి శస్త్ర చికిత్స చేసేందుకు వీలుగా జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో ఏర్పాటు జరిగాయి.
ఇందులో భాగంగా కామినేని ఆసుపత్రి నుంచి నాగోల్ మెట్రో స్టేషన్‌కు అంబులెన్స్ ద్వారా 3 నిమిషాల్లో గుండెను తరలించారు. అక్కడి నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు మెట్రోస్టేషన్ కు 21 కిలోమీటర్ల దూరం కాగా మధ్యలో 17 స్టేషన్లు ఉన్నాయి. ఈ ప్రత్యేక మెట్రో రైల్‌ను ఎక్కడా ఆపకుండా కేవలం 25 నిమిషాల వ్యవధిలో చేర్చారు. అక్కడి నుంచి అపోలో ఆసుపత్రికి కేవలం 3 నిమిషాల్లో చేర్చి కిడ్నీ, గుండె మార్పిడిని పూర్తి చేశారు. దీంతో నిండు ప్రాణం నిలిచింది. ఈ ఆపరేషన్‌లో లో మెట్రో రైల్ కీలక భూమిక పోషించింది.













