తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన గొప్ప నాయకుడు
నందమూరి తారక రామారావు 25వ వర్థంతి సందర్భంగా లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ ఘాట్లో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన గొప్ప నాయకుడు, ఎంతోమందికి స్ఫూర్తిప్రదాత ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయన పేరు చెప్పకోకుండా ఏ పార్టీ కూడా ముందుకు వెళ్లలేదని అన్నారు. ప్రతి ఒక్క నాయకుడు ఎన్టీఆర్ ఆశయాలతో ముందుకు వెళుతున్నారన్నారు. అందుకే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మంచి పరిపాలన జరుగుతుందని లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు.













