లక్ష్మీపార్వతి కీలక వ్యాఖ్యలు.. రాజకీయాల్లోకి ఎన్టీఆర్?

దివంగత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ఆయన సతీమణి, వైఎస్‌ఆర్ సీపీ నేత లక్ష్మీ పార్వతి కీలక వ్యాఖ్యలు చేసింది. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన ఆమె పలు వ్యాఖ్యఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి మంచి పరిపాలననే నడుస్తుందంటూ పరోక్షంగా రెండోసారి కూడా వైఎస్‌ఆర్‌సీపీనే అధికారంలోకి రాబోతుందని ఆమె పేర్కొన్నారు. జూన్ 4 తరువాత జగన్ మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని, ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ మంచిపాలన వస్తుందని ఆమె అన్నారు. వైఎస్ జగన్‌కు ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. నిజంగా జగన్‌కు మద్దతు ఉందా? ఒకవేళ ఉంటే చంద్రబాబుకు ఇవ్వకుండా జగన్‌కు ఎందుకు ఇస్తాన్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాబోతున్నారా? ఇలా రకరకాలుగా ఇరు రాష్ట్రాల్లో చర్చలు కొనసాగుతున్నాయి.