తెలంగాణ నుంచి లగడపాటి పోటీ ?
తనకు అవకాశం ఇస్తే తెలంగాణలో కచ్చితంగా పోటీ చేస్తానని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చెప్పారు. పొలిటికల్ రి ఎంట్రీపై ఆయన సృష్టత ఇచ్చారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీకి వెళ్లే ఆలోచన లేదని, పార్లమెంట్‌కు అవకాశం వస్తే పోటీ చేస్తానని తెలిపారు. డిసెంబర్ 7 తర్వాతే తెలంగాణ ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు వస్తాయని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ పొత్తు విజయవంతం అవుతుందా? లేదా అనేది ప్రజలే చెప్పాలన్నారు. పార్టీలు కోరితే ముందే సర్వే చేసి చెబుతానని ఆయన పేర్కొన్నారు. మహాకూటమిలో సీట్ల సర్దుబాటు అనంతరం ప్రజల నాడి చెబుతానని లగడపాటి వెల్లడించారు. టీడీపీ, కాంగ్రెస్‌లు ఏ రాష్ట్రంలోనూ ప్రత్యర్థులు కారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవం ఉన్న నాయకుడని ఆయన ప్రయత్నాలు ఆయనే చేసుకుంటాని ఆయన వ్యాఖ్యానించారు. జగన్‌పై దాడిని ఆయన ఖండించారు.













